![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -789 లో.... బాబుని అపర్ణ దగ్గరికి వెళ్లి పడుకోమని పంపిస్తుంది కావ్య. బాబు అపర్ణ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు నేను పడుకోవాలంటే కథ చెప్పాలని బాబు అనగానే అపర్ణ కథ చెప్పి బాబుని పడుకోబెడుతుంది.
మరుసటిరోజు బాబు నిద్ర లేచి మొక్కలకి నీళ్లు పడుతుంటాడు. పైనుండి రుద్రాణి చూసి అసలు ఆ బాబూ ఎవరు గుళ్లో తప్పిపోతే అక్కడ ఎవరికైనా అప్పగించాలి లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి.. ఇలా ఇంటికి తీసుకొని రావడం ఏంటి.. దీని వెనకాల ఏదైనా ఉందా బాబుని అడగాలని బాబు దగ్గరికి వస్తుంది రుద్రాణి. బాబు నీ పేరెంట్స్ ఎవరు.. వారి పేరు ఏంటని రుద్రాణి అడుగుతుంది. నీకెందుకు చెప్పాలని బాబూ అంటాడు. నీకు చాక్లెట్ ఇస్తానని రుద్రాణి అనగానే సరే అడుగు అని చాక్లెట్ తీసుకుంటాడు బాబు. మీ అమ్మ పేరు ఏంటి అని అడుగగా.. అమ్మ అని అంటాడు. నాన్న పేరేంటంటే నాన్న అని ఆ బాబు అంటాడు. ఏం అడిగినా అలానే చెప్తూ రుద్రాణికి చిరాకు తెప్పిస్తాడు. రుద్రాణి తనపై కోప్పడుతుంది. దాంతో బాబు రుద్రాణి పై వాటర్ పడతాడు. రుద్రాణి కొట్టబోతుంటే అప్పుడే అపర్ణ వచ్చి.. చిన్నపిల్లాడిని కొడుతావా అని తనపై కోప్పడుతుంది.ఆ తర్వాత కావ్య అందంగా రెడీ అవుతుంది. ఏంటి ఇలా రెడీ అయ్యావని ఇందిరాదేవి అడుగుతుంది. ఈ రోజు ఆయన నాకు ప్రపోజ్ చేయబోతున్నారని కావ్య చెప్పగానే అపర్ణ, ఇందిరాదేవి కలిసి కావ్యని ఆటపట్టిస్తారు.
మరొకవైపు ఆ బాబు రేవతి కొడుకు అన్న విషయం కళ్యాణ్ కి అప్పు చెప్పగానే.. ఇంట్లో తెలిస్తే ఎలా అని అతను టెన్షన్ పడతాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే నిన్న ఈ చైర్ లో కూర్చున్నా.. నాది ఆ చైర్ అని కళ్యాణ్ ని లేపి మరి బాబు కూర్చుంటాడు. ఆ తర్వాత బాబుని మెచ్చుకుంటుంటే ఎవరనుకున్నావ్ ఈ ఇంటి బిడ్డ అని ఇందిరాదేవి అనగానే అందరు షాక్ అవుతారు. అంటే అత్తయ్య ఫ్రెండ్ ఇక్కడున్నాడు కాబట్టి మన ఫ్యామిలీ కదా అని కావ్య కవర్ చేస్తుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతు దేవుడుకి మొక్కుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |